: కామెడీ నటుడితో జత కట్టనున్న శృతిహాసన్


తెలుగునాట ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న శృతిహాసన్ బాలీవుడ్ లో మాత్రం బాలారిష్టాలు దాటలేకపోతోంది. నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క హిట్ కూడా దక్కించుకోని శృతి, తాజాగా కామెడీ నటుడు కపిల్ శర్మతో జత కట్టనుంది. కామెడీ నైట్స్ విత్ కపిల్ టీవీషోతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కపిల్ శర్మ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నటుడిగా యష్ రాజ్ ఫిల్మ్స్ లో నటిస్తున్న కపిల్ శర్మ, గాయకుడిగా మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఈ మధ్య ఓ విమాన ప్రయాణంలో శృతిహాసన్ ను కలిశానని, సంగీతంపై ఇద్దరి అభిరుచులు కలిశాయని అన్నారు. ఆమెతో కలిసి ఓ పాటను పాడాలని అప్పుడే నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. శృతి తండ్రి కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని కపిల్ శర్మ తెలిపాడు. కాగా ఈ పాట వీడియోలో మరో గాయకుడు సుఖ్విందర్ సింగ్ కూడా కనిపించనున్నారట. ఈ పాటను కోక్ స్టూడియోస్ లో రూపొందించనున్నారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News