: రాష్ట్ర శాంతిభద్రతలపై కేంద్రానికి వివరించాం: గవర్నర్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. కొద్ది సేపటి కిందటే కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో ఆయన బేటీ ముగిసింది. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర శాంతిభద్రతలపై కేంద్రానికి వివరించినట్లు చెప్పారు. సలహాదారుల నియామకం రెండు రోజుల్లో పూర్తవుతుందని అనుకుంటున్నానన్నారు. సాయంత్రం ప్రధానిని కలుస్తానని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తున్నానన్నారు. పెట్రోల్ బంకుల్లో అవకతవకలకు పాల్పడొద్దని, ప్రస్తుతం వాడుతున్న యంత్రాలను తొలగించి, కచ్చితమైన యంత్రాలను వినియోగించాలని ఆయన సూచించారు.