: అఫ్రిది మితిమీరిన ఆత్మవిశ్వాసం
పాకిస్తాన్ విధ్వంసక ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మునుపెన్నడూలేనంత ఫామ్ తో దూసుకెళుతున్నాడు. భారత్, బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్ లలో ఈ పఠాన్ బ్యాట్ శతఘ్నిలా గర్జించింది. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించిన అఫ్రిది ఆ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. నిన్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ పై మీడియాతో మాట్లాడుతూ, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తనకు బ్యాటింగ్ కోచ్ అవసరం లేదన్నాడు. తనకు కావల్సిందల్లా ఆత్మవిశ్వాసం నింపడమేనని చెప్పుకొచ్చాడు. పాక్ బ్యాటింగ్ కోచ్ మొయిన్ ఖాన్ తనకు అవసరమైన స్థయిర్యాన్ని అందిస్తున్నాడని ఈ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. కెప్టెన్ మిస్బా సహకారం మరువలేనిదని కొనియాడాడు. భారీ లక్ష్యాలను ఛేదించడాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని, నిన్నటి మ్యాచ్ లో భారీ టార్గెట్ ను తమ ముందు ఉంచినందుకు బంగ్లా జట్టుకు ధన్యవాదాలని తెలిపాడు.