: ఎన్నికల ఎఫెక్ట్... ప్రైవేటు హెలికాప్టర్లకు పెరిగిన గిరాకీ!


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇకపై చేపట్టాల్సిన ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లపై నేతలు దృష్టి సారిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు దేశం నలుమూలలా తిరగాల్సి ఉండడంతో ఇప్పుడందరి చూపూ హెలికాప్టర్లపై పడింది. ముఖ్యంగా బీహార్లో ముందస్తుగానే హెలికాప్టర్లను బుక్ చేసుకుంటున్నారు. సీఎం నితీశ్ కుమార్ తన సంకల్ప్ యాత్ర కోసమని ఇప్పటికే ఓ ప్రైవేటు హెలికాప్టర్ ను వినియోగిస్తుండగా, ఆయన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ నేడు ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. గయ జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాలూ నేడు సభల్లో పాల్గొంటున్నారు. కాగా, గత సోమవారం ముజఫర్ పూర్ లో జరిగిన మోడీ సభకు హాజరయ్యేందుకు పలువురు బీహార్ బీజేపీ నేతలు హెలికాప్టర్లు వినియోగించారు. కాగా, ఎన్నికల ప్రచారానికి పార్టీ ఇప్పటికే ఆరు హెలికాప్టర్లను బుక్ చేసిందని బీజేపీ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News