: జూన్ 2 నాటికి రెండు రాష్ట్రాలకు రెండు వెబ్ సైట్లు


రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జూన్ రెండు నాటికి రెండు వెబ్ సైట్లు రూపొందించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మహంతి నిర్ణయించారు. ఈ మేరకు విభజన కోసం ఏర్పాటు చేసిన 14 కమిటీలతో ఈ రోజు సమావేశమైన సీఎస్... ఆస్తులు, అప్పులు, దస్త్రాలు, ఉద్యోగుల పంపిణీపై మార్చి నెలాఖరుకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత రెండు నెలల కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను సీఎస్ గవర్నర్ కు పంపనున్నారు.

  • Loading...

More Telugu News