: ధోనీని వెనక్కి నెట్టిన కోహ్లీ


ఇటీవల వరుస పరాజయాలతో టీమిండియా ప్రాభవం కాసింత మసకబారిన నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కివీస్ పర్యటన అనంతరం గాయంతో ధోనీ జట్టుకు దూరం కాగా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ను విశేషంగా పెంచుకున్న ధోనీ తాజాగా గూగుల్ సెర్చ్ తాజా ట్రెండ్స్ లో వెనుకబడ్డాడట. ఈ విషయంలో అతడి డిప్యూటీ కోహ్లీ ముందంజలో ఉన్నట్టు గూగుల్ పేర్కొంది. అనుష్క శర్మతో ప్రేమాయణం పుణ్యమాని నెట్ లో కోహ్లీ గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళే ఎక్కువయ్యారట. ఇక వాణిజ్య ఒప్పందాల దృష్ట్యా కూడా కోహ్లీదే పైచేయి. 2013 చివరినాటికి ఈ విషయంలో కోహ్లీ ధోనీని అధిగమించి అత్యధిక వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమన్నాడు. కాగా, క్రికెట్ నుంచి తప్పుకున్నా గూగుల్ సెర్చ్ సరళిలో సచిన్ టెండూల్కర్ కు తిరుగులేదని ఈ సెర్చ్ ఇంజన్ పేర్కొంది.

  • Loading...

More Telugu News