: 67 మంది కాశ్మీర్ విద్యార్థులను సస్పెండ్ చేసిన యూపీ వర్శిటీ!


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం స్వామి వివేకానంద్ సుభర్తి ఒక్కసారే 67 మంది కాశ్మీర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. రెండు రోజుల కిందట (ఆదివారం) భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ ను విశ్వవిద్యాలయంలోని ఓ హాల్ లో వీక్షించిన విద్యార్థులు పాక్ విజయం సాధించిన వెంటనే పెద్దగా అరుస్తూ సంబరాలు జరుపుకున్నారు. సదరు విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వవిద్యాలయం వెంటనే చర్యలు తీసుకున్నట్లు ఉప కులపతి డాక్టర్ మంజూర్ అహ్మద్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇదే విషయంపై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆర్ కె గార్డ్ మాట్లాడుతూ, విద్యార్థులు అరుస్తూ, పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని, క్యాంపస్ లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారని వివరించారు.

  • Loading...

More Telugu News