: తెలంగాణలో ఎన్నికల తేదీలు
16వ సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 9 వ తేదీ కాగా, నామినేషన్లను ఏప్రిల్ 10న పరిశీలించనున్నారు. ఏప్రిల్ 12న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 30 న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 16న జరుగనుంది.