: బాలుడి జాడను పట్టిచ్చిన వాట్స్ యాప్


సోషల్ మీడియా పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. వాట్స్ యాప్ అప్లికేషన్ ద్వారా పోలీసులు తప్పిపోయిన బాలుడి ఆచూకీని కనుక్కోగలిగారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలో ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన 11 ఏళ్ల పర్మిందర్ సింగ్ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడి ఫొటోను వాట్స్ యాప్ లో అప్ లోడ్ చేశారు. దాంతో, ఆ ఫొటో యూజర్లందరికీ చేరిపోయింది. డూన్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి స్మార్ట్ ఫోన్ లోనూ పర్మిందర్ ఫొటో దర్శనమిచ్చింది. అదే సమయంలో తనకెదురు సీట్లో ఆ బాలుడే కనిపించాడు. దాంతో, ఆ విద్యార్థి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో అతడిని అధీనంలోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News