: లాలూతో కాంగ్రెస్ రాజీ... కలవనున్న చేతులు?


బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతో రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో చాన్నాళ్లుగా అనిశ్చితి కొనసాగుతోంది. 40 లోక్ సభ స్థానాలుండగా... కాంగ్రెస్ కు 11, ఎన్సీపీకి 1 స్థానం కేటాయిస్తానని... అంతకంటే ఎక్కువిచ్చేది లేదని లాలూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మతతత్వ శక్తులపై పోరాడేందుకు కలసి రావాలని కోరారు. ఇక్కడే ప్రతిష్ఠంభన ఏర్పడింది. కేవలం 11 స్థానాలే అనేసరికి కాంగ్రెస్ వెనకడుగు వేసింది. అధికార జేడీయూతో పొత్తు పెట్టుకునే యత్నాలు సాగించింది. కానీ, బీహార్ ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ నేపథ్యంలో వారి మధ్య చర్చలు సఫలం కాలేదు. దీంతో, మళ్లీ ఆర్జేడీతో చర్చలు జరపగా... కాంగ్రెస్ కు 12 స్థానాలు, ఎన్సీపీకి 1... మిగతా స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ లోపు రాజకీయ పరిణామాలు మరో ములుపు తీసుకుంటాయో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News