: భారత్ విజయ లక్ష్యం 154 పరుగులు


భారత బౌలర్లు చెలరేగిపోవడంతో ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ పై కేవలం 154 పరుగుల స్వల్ప ఆధిక్యాన్నే నమోదు చేసింది. జడేజా 5, అశ్విన్, ఓజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఉదయం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దగ్గర నుంచీ ఏ దశలోనూ కుదురుగా, ధాటిగా ఆడలేదు. భారత బౌలింగ్ వారితో చెమటలు కక్కించింది. సిడిల్ ఒక్కడే భారత బౌలింగ్ ను చీల్చి చెండాడాడు.

 కేవలం 45 బంతులలో 54 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లే ఉన్నాయి. సిడిల్ క్రీజులో చెలరేగుతుంటే భారత బౌలర్లలో గుబులు రేగింది. 50 పరుగుల స్కోరు వద్ద ఇతడు అవుటవడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. కొవాన్ 24 పరుగులు చేశాడు. వీరిద్దరు తప్పిస్తే మిగతా బ్యాట్స్ మెన్ అందరూ 20లోపు పరుగులకే చేతులెత్తేశారు. 

154 పరుగుల స్వల్ప లక్ష్యమే భారత్ ముందున్నది. జాగ్రత్తగా ఆడితే గెలుపు భారత్ దే. మరి మన బ్యాట్స్ మెన్ కుదురుగా ఆడి నాలుగో టెస్ట్ నూ కైవసం చేసుకుంటారో లేక ఆసీస్ బౌలర్ల చేతిలో చిత్తవుతారో చూడాలి. 

  • Loading...

More Telugu News