: నేడు వరంగల్ లో జైరాం రమేష్ పర్యటన
కేంద్ర మంత్రి జైరాం రమేష్ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని, సోనియా ఆదేశాలమేరకు తెలంగాణ ఏర్పాటుకు సహకరించానని సీమాంధ్ర పర్యటన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో, వరంగల్ లో ఆయనను అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.