: భారత్ ఫైనల్ ఆశలకు బంగ్లా ఊపిరి పోసేనా...?
వన్డే వరల్డ్ చాంపియన్ భారత్ కు ఎంతటి దుస్థితి! ఆసియా కప్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి ఫైనల్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న టీమిండియా... ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే భారత్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అప్పుడు భారత్ రేపు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో బోనస్ పాయింట్ సాధించాల్సి ఉంటుంది. అంటే భారీ విజయం సాధించాలన్నమాట. ఈ విషయమై మిర్పూర్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో సర్వశక్తులూ ఒడ్డుతామని ధీమాగా చెప్పాడు. అనుభవరాహిత్యం కొన్ని మ్యాచ్ లలో ప్రతికూల ఫలితాలనిచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇకపై జాగ్రత్తగా ఆడతామని చెప్పాడు.