: అవన్నీ వాస్తవాలైతే సీమాంధ్రలో పోటీచేసి గెలవగలరా?: సోమిరెడ్డి సవాల్


కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పేవన్నీ వాస్తవాలైతే కేంద్ర మంత్రులు సీమాంధ్రలో పోటీ చేసి గెలవాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు రాజధాని, హైకోర్టు, ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉంటాయన్న కనీస పరిజ్ఞానం కూడా లేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ప్రజల గురించి కానీ, సీమాంధ్ర ప్రజల అవసరాల గురించి కానీ జైరాం రమేష్ కు మాట్లాడే అర్హత లేదని అన్నారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయకత్వంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సోమిరెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News