: పాక్ ను చితక్కొట్టిన బంగ్లా... పాక్ విజయ లక్ష్యం 327


ఆసియా కప్ లో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది. పాకిస్థాన్ బౌలర్లను బంగ్లా బ్యాట్స్ మెన్ చితక్కొట్టుడు కొట్టారు. బౌలర్ ఎవరనే తేడా లేకుండా అందర్నీ ఆటాడుకున్నారు. దీంతో, బంగ్లాదేశ్ తన క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు 326/3 సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. అనాముల్ హక్ సెంచరీ చేయగా, ఇమ్రుల్ 59, మోమినుల్ హక్ 51, ముష్పికర్ 51* పరుగులు చేశారు. ఇక షకిబ్ ఆల్ హసన్ కేవలం 16 బంతుల్లోనే 44* పరుగులు చేశాడు. దీంతో, బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News