: ఇంతకంటే మూర్ఖుడుంటాడా...?
పాకిస్తాన్ లో మతఛాందసం ఏ స్థాయిలో వేళ్ళూనుకుందో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ. అబు హైదర్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమారులను జిహాద్ కోసం దానమిచ్చేశాడు. ఆ దానం స్వీకరించింది మామూలు వ్యక్తి కాదు. భారత్ అంటే నరనరానా విద్వేషం నింపుకున్న కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్. జమాత్ ఉద్ దవా చీఫ్ అయిన సయీద్ కు తన ముగ్గురు కొడుకులను, లాహోర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని నంకణా సాహిబ్ వద్ద నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అప్పగించాడీ మూర్ఖపు తండ్రి. సయీద్ దీనిపై స్పందిస్తూ, హైదర్ ను 'ధైర్యశాలి' అని కితాబిచ్చాడు. 2008లో లష్కరే తోయిబాపై అంతర్జాతీయంగా నిషేధం విధించడంతో దాని పేరు జమాత్ ఉద్ దవాగా మార్చిన సంగతి తెలిసిందే. 2008 ముంబయి పేలుళ్ళకు ఈ ఉగ్రవాద సంస్థే బాధ్యురాలన్న సంగతి తెలిసిందే.