: సచివాలయాన్ని ఖాళీ చేసిన మంత్రులు
రాష్ట్ర సచివాలయం బోసిపోయింది. పలువురు తాజా మాజీ మంత్రులు సచివాలయంలోని తమ తమ కార్యాలయాలను ఖాళీ చేశారు. జానారెడ్డి, గీతారెడ్డి తదితరులు ఈ రోజు సచివాలయంలోని తమ కార్యాలయాల్లోని దస్త్రాలు, సామగ్రిని తరలించుకుని వెళ్లారు. రాష్ట్రపతి పాలన సందర్భంగా పేషీలు ఖాళీ చేయాలని ప్రజా పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.