: పవన్ కల్యాణ్ పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ)!
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం ఖరారైపోయిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ పవన్ కల్యాణ్ అనుచరులు తనతో మంతనాలు సాగించారని తోట త్రిమూర్తులు, వంగా గీతలు వెల్లడించారు. దీంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు పవన్ కల్యాణ్ సొంత పార్టీ పెట్టబోతున్నారని... ఆ పార్టీకి ఆయన అన్నయ్య పెట్టిన పీఆర్పీ కలిసి వచ్చేలా పవన్ రిపబ్లిక్ పార్టీ (పీఆర్పీ) లేదా యువరాజ్యం పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
దీనికితోడు, పవన్ రాజకీయాల్లోకి వస్తానంటే తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని లోక్ సత్తా పార్టీ ప్రకటించింది. మరో వైపు ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.