: నిర్బంధించి... 11 నెలల పాటు అత్యాచారం


రాజస్థాన్ లోని జైపూర్ లో సభ్యసమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన దారుణమైన ఘటన వెలుగుచూసింది. భట్టాబస్తీ లోని రాంఖిలారీ సైనీ, అతడి భార్య గీతతో కలిసి ఓ 30 ఏళ్ల మహిళను 11 నెలల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం ఆమె గర్భం దాల్చగా, భార్యాభర్తలిద్దరూ కలసి అబార్షన్ చేయించారని బాధితురాలు తెలిపింది. వీరి అరాచకంపై ఆమె పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై సెక్షన్ 376 సహా వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News