: వెనక్కి తగ్గిన రష్యా


ఉక్రెయిన్ పై సైనిక చర్య పట్ల అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలు రష్యా అధినాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఓవైపు అమెరికా, మరోవైపు సహచర యూరోపియన్ దేశాలు ఒత్తిడి పెంచుతుండడంతో రష్యా క్రమంగా మెత్తబడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వ కార్యదర్శి జాన్ కెర్రీ ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు వద్ద మోహరించిన రష్యా బలగాలు బేస్ క్యాంపులకు చేరుకోవాలని ఆయన నేడు ఆదేశాలు జారీ చేశారు.

ఉక్రెయిన్ లో అధికార మార్పును గుర్తించని రష్యా... ఉక్రెయిన్ లో ఉన్న లక్షలాది రష్యన్ల భద్రత కోసమే తాము సైనిక చర్యకు దిగామని సమర్థించుకుంటోంది. ఇటీవలే పలు ఆరోపణలపై విక్టర్ యనుకోవిచ్ ను ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి దింపేయగా, అతడికి ఆశ్రయం కల్పిస్తామని రష్యా ప్రకటించింది. అనంతరం ఆర్సెనియం యత్సెన్యుక్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమన్న రష్యా, తన బలగాలను ఉక్రెయిన్ దిశగా నడిపింది.

  • Loading...

More Telugu News