: కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆప్ ధర్నా
కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ఈ నెల 8న ఆమ్ ఆద్మీ పార్టీ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనుంది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ పాలన ఎలా వర్ధిల్లుతోందన్న విషయాలను వెల్లడిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 48 కుటుంబాలు రాజకీయాలను శాసిస్తున్నాయని, వీరి గిమ్మిక్కులతో సాధారణ ప్రజలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోతోందని ఆప్ నేత బెల్లా నాయక్ మండిపడ్డారు.