: టీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితం: గండ్ర
కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలిసొస్తే అధికార హోదా దక్కుతుందని, ఒంటరిగా వెళితే ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి ఉంటుందని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు తెలంగాణలో పర్యటించే నైతికహక్కు లేదని అన్నారు. ఖమ్మం ప్రజలు ఛీ కొడుతుంటే ఏ ముఖం పెట్టుకుని జగన్ పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. జేఏసీ తలపెట్టిన బంద్ కు మద్దతిస్తామని గండ్ర స్పష్టం చేశారు.