: ఈ వారంలోనే కొత్త రాజధాని కోసం కమిటీ ఏర్పాటు: జైరాం రమేష్


చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నాయని... సీమాంధ్రలో ఏది ఎక్కడ ఉండాలనే విషయాన్ని కేంద్రం నియమించే ప్రత్యేక కమిటీ నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఈ వారంలోనే కమిటీని నియమిస్తామని చెప్పారు. కొత్త రాజధానికోసం సీమాంధ్రలో చాలా ప్రతిపాదనలున్నాయని తెలిపారు. ఈ రోజు గుంటూరు పర్యటనలో ఉన్న జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చింది 2014 ఎన్నికలలో లబ్ధి పొందడానికి కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చినా సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణ డిమాండ్ కు భావోద్వేగ, ఆర్థిక కారణాలున్నాయని చెప్పారు. కృష్ణా, గోదావరి జల మండళ్లలో రాజకీయ నాయకులు ఉండరని... కేవలం మేధావులు మాత్రమే ఉంటారని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ బోర్డులు కావని తెలిపారు.

  • Loading...

More Telugu News