: సోనియా నివాసంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసం టెన్ జన్ పథ్ లో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం చేసిన కాంగ్రెస్, జాబితా ప్రకటించే అంశంపై భేటీలో చర్చిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.