: వడగళ్ల వానతో అపార నష్టం
రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వడగళ్ల వాన ధాటికి 5 మండలాల పరిధిలో అరటి, కర్బూజ, బొప్పాయి, మామిడి రైతులు భారీగా నష్టపోయారు. నిజామాబాద్ జిల్లాలోని భీమ్ గల్, ఖమ్మర్ పల్లి, ఆర్మూర్, బోధన్ మండలాల్లో చేతికొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి.