: ఆదిలాబాద్ ను కాశ్మీర్ చేస్తా: కేసీఆర్
తెలంగాణకు బలమైన నాయకత్వం కావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అలా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత దేశానికి కాశ్మీర్ ఎలాంటిదో తెలంగాణ రాష్ట్రానికి ఆదిలాబాద్ జిల్లా అలాంటిదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 12 రెట్లు అదనపు వర్షపాతం నమోదవుతుందని, అందువల్ల అది ఉత్తమ పర్యాటక క్షేత్రంలా భాసిల్లుతుందని కేసీఆర్ అన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కడితే ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎకరం భూమి కూడా వృథాగా పోకుండా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.