: రాష్ట్ర విభజనపై ఈ నెల 7న సుప్రీంకోర్టు విచారణ
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 7వ తేదీన విచారణకు రానుంది. విభజనపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడటంతో, విచారణకు ఇది సరైన సమయమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అందర్లోను ఉత్కంఠ నెలకొంది. గతంలో విభజనపై దాఖలైన పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు... విచారణకు సమయం కాదని తిరస్కరించిన సంగతి తెలిసిందే.