: హార్న్ కొడితే ఎంపీ3 ప్లేయర్ కు బ్రేకులు వేసే యాప్!


సంగీతం వింటూ వాహనాలను నడుపుతూ వెళ్లడం ఇటీవల ప్రమాదాలకు దారితీస్తోంది. చెవిలో హెడ్ ఫోన్లతో సంగీతాన్ని వింటూ, కాల్స్ మాట్లాడుకుంటూ నడిచి వెళుతున్న వారూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఏడాది క్రితం హైదరాబాద్ లో ఒక యువతి ఇలానే సంగీతం వింటూ రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. చెవులకు చిల్లులు పడే స్థాయిలో సంగీతం వింటూ రోడ్లపై వెళ్లడమే ఈ ప్రమాదాలకు కారణం. ఆ సమయలో హార్న్ కొట్టినా.. ఎలాంటి శబ్దం వినిపించే పరిస్థితి ఉండదు.

కానీ ఇది గతం. ఇకపై సంగీతం వింటున్న సమయంలో హార్న్ కొట్టినా చక్కగా వినిపించగలదు. ఇందుకోసం ఓ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ను అమెరికాకు చెందిన వన్ లియామా కంపెనీ తయారు చేసింది. ఇది ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. వాహనాలను డ్రైవ్ చేస్తున్నా.. నడచి వెళుతున్నా.. హార్న్, ఇతర శబ్దాలు వచ్చినప్పుడు హెడ్ సెట్ లో సంగీతం ఆగిపోతుంది. మళ్లీ ఆ శబ్దం ఆగిపోగానే సంగీతం వినిపించడం మొదలవుతుంది.

  • Loading...

More Telugu News