: మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు.. ఏప్రిల్ 2న కౌంటింగ్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మార్చి 30న (ఆదివారం) ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి తెలిపారు. రీపోలింగ్ అవసరమైన చోట ఏప్రిల్ 1న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2న కౌంటింగ్ జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం) వాడతామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని చెప్పారు.