: రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్?
ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి తనకు అత్యంత సన్నిహితులైన వారితో పవన్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక స్పృహ కలిగిన పవన్ కల్యాణ్ తన లక్ష్యాలను రాజకీయాల ద్వారానే చేరుకోగలనని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పటి నుంచి... తన అన్నయ్యకు పవన్ దూరంగా ఉంటున్నారు. దీంతో, ఆయన ఇతర రాజకీయ పార్టీలతో కలసి పని చేస్తారా?, లేక మరేదైనా ఆలోచన ఉందా? అనే విషయం తెలియాల్సి ఉంది.