: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చి చివర్లో కాని, ఏప్రిల్ ప్రారంభంలో కాని ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి రేపు ప్రకటించే అవకాశం ఉంది. 146 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల మిగిలిన వాటికి తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నారు.