: 92 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్
92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తల్హా బౌలింగ్ లో మహమ్మద్ హఫీజ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 17 పరుగులతో ఆడుతున్న రహానేకి అంబటి రాయుడు జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 92 పరుగులు.