: 22వ అర్థ శతకం పూర్తి చేసిన రోహిత్ శర్మ
ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డేలో రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో రోహిత్ వన్డేల్లో 22వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరో వైపు రహానే 9 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 14.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.