: పోలవరం ముంపు ప్రాంతం సీమాంధ్రలో... ఆర్డినెన్స్ కు నేడు కేబినెట్ ఆమోదం!
కేంద్ర కేబినెట్ భేటీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఇందులో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని.. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే అన్ని మండలాలను (భద్రాచలం పట్టణం మినహా) సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీకి పచ్చజెండా ఊపవచ్చని సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. దీంతోపాటు అవినీతి వ్యతిరేక చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్స్ లపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.