: సోమ, మంగళవారాల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ వీడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఫైల్ పై గవర్నర్ నరసింహన్ సంతకం చేశారు. దీంతో, 40 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సోమ, లేదా మంగళవారం వెలువడే అవకాశం ఉంది.