: ఆ రెండు సైట్లపై ఓ కన్నేయాలి: ప్రణబ్


ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ లపై నిశిత పరిశీలన అవసరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జాతీయ భద్రత సంస్థలకు సూచనలు చేశారు. ఢిల్లీలో సీఆర్పీఎఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొన్నిప్రాంతాల్లో మత అల్లర్లు పెరిగేందుకు సోషల్ మీడియా కూడా ఓ కారణమవుతోందని తెలిపారు. త్వరితగతిన హింస ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకిపోవడానికి ఈ సామాజిక మాధ్యమం వారధిగా నిలుస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News