: విజయవాడ కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేస్తా: లగడపాటి
ఇకనుంచి విజయవాడ కేంద్రంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని బహిష్కృత కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన పనిలేదన్నారు. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. రాజకీయాల్లో యువ నాయకులను ప్రోత్సహించాలన్నారు.