: నన్ను సీబీఐ కేవలం సాక్షిగానే పిలిచింది: కేవీపీ


జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ముగించుకుని వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు దిల్ కుషా అతిథి గృహం నుంచి వెలుపలికి వచ్చారు. ఆయనను సీబీఐ దాదాపు ఎనిమిదన్నర గంటలపాటు విచారించింది. జగన్ 'క్విడ్ ప్రొ కో' లో ఎవరెవరికి లబ్ది చేకూరిందనే విషయంపై సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది.

విచారణ ముగిసిన అనంతరం కేవీపీ మీడియాతో మాట్లాడారు.  సీబీఐ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు తనను కేవలం సాక్షిగానే పిలిచిందని తెలిపారు. సీబీఐ నోటీసులకు అనుగుణంగా తనకు తెలిసిన వివరాలను చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News