: మేం ప్రతిపాదించాం...కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది: లాలూ
వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఇస్తామని ప్రతిపాదించినట్టు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఇంకొంత కాలం కాంగ్రెస్ స్పందన కోసం ఎదురు చూస్తామని లాలూ తెలిపారు.