: ఎస్సై అభ్యర్థుల ఆందోళన


2011 ఎస్సై పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఎస్సై అభ్యర్థులు ఇందిరా పార్కు సమీపంలో ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్సై పరీక్షలు పూర్తై రెండేళ్లు గడిచినా ఫలితాలు విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు నియామక మండలి, గవర్నర్, ముఖ్యమంత్రి ఇలా అందరికీ విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడించకుంటే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News