: అప్పటి వరకు పిచ్చామె చేతిలోనే అధికారం: జేసీ
ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారం పిచ్చావిడ చేతిలోనే ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఆమె రాయి ఎటు విసురుతుందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో చేరాలంటే ఎంపీ టికెట్ కు 30 కోట్ల రూపాయలు, ఎమ్మెల్యే టికెట్ కు 5 కోట్ల రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో కేవలం డబ్బు మాత్రమే పని చేయదని, గుణగణాలు, శక్తి సామర్థ్యాలు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్లు ఉన్న అనుబంధం తెంచుకోవడం బాధగా ఉన్నా, ఉంటేనేం? పోతేనేం? అనడంతోనే ఈ సమస్య ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.