: సోనియా గాంధీని కూడా బాబు పార్టీలో చేర్చుకునేలా ఉన్నారు: బైరెడ్డి


పార్టీలు మారుతున్న వారికి, పార్టీలలో చేర్చుకుంటున్న వారికి సిగ్గులేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీని కూడా టీడీపీ అధినేత తన పార్టీలో చేర్చుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. తల్లిని చంపేసి పిల్లను బతికించారని నరేంద్ర మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని... డాక్టర్ సోనియా, డాక్టర్ సుష్మాస్వరాజ్ లదే ఆ పాపమని తెలియదా? అని ప్రశ్నించారు.

ప్రధాని అవుతానంటున్న మోడీ సహా అందరూ అబద్ధాలే చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ పోటీ పడలేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీల నేతలందరూ కుమ్మక్కై తెలుగు తల్లిని హత్య చేయలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News