: వారిద్దరూ తెలుగుతల్లిని చంపిన హంతకులు: రోజా


ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత రోజా నిప్పులు చెరిగారు. తెలుగుతల్లిని దారుణంగా చంపిన హంతకులు కిరణ్, చంద్రబాబు అంటూ ఆమె మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ముమ్మాటికీ కారణం వీరిద్దరేనని ఆమె ఆరోపించారు. సీఎంగా ఉన్న కిరణ్ చివరి బంతి అంటూ తెలుగు ప్రజలను చివరి వరకూ ద్రోహం చేశారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడింది జగన్ ఒక్కరేనని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News