: గుంతకల్లులో భారీగా పేలుడు పదార్థాలు దొరికాయ్..!
అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసుల తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు దొరికాయి. ఈరోజు (శనివారం) వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 డిటోనేటర్లు, 10 కిలోల అమ్మోనియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను తీసుకెళుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులను గుంతకల్లు పోలీస్ స్టేషనుకు తరలించి, కేసు నమోదు చేశారు.