: అనంతపురం ఆసుపత్రిలో చిన్నారులకు తప్పిన ముప్పు


అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని నవజాత శిశువుల వార్డులో ఈరోజు (శనివారం) అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది చిన్నారులను పక్కనున్న వార్డులోకి తరలించారు. దీంతో పెనుముప్పు తప్పింది. ఆ సమయంలో వార్డులో 21 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News