: చరిత్ర చివరి పేజీలో చిరస్థాయిగా కిరణ్
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అంతా సిద్ధమైన వేళ అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ చరిత్రలో మిగిలిపోనున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ చరిత్రలో చివరి ముఖ్యమంత్రిగా చివరి పేజీలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోనున్నారు. ఇప్పటిదాకా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నను ఏదో ఒక పరీక్షలో మనందరం ఎదుర్కొనే ఉంటాం. కానీ, ఇకపై పరీక్షలు, క్విజ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న కూడా ఎదురవబోతోంది. ఈ రకంగా, రాష్ట్రాన్ని పరిపాలించిన ఎంతో మంది మహామహుల కంటే చరిత్రలో కిరణ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.