: శవానికైనా తాళి కడతానంటూ ఓ ప్రేమోన్మాది బెదిరింపు


సమాజంలో బంధాలు, విలువలపై ఎవరెంత మొత్తుకున్నా.. నేటి తరానికి తలకెక్కడం లేదు. ప్రేమోన్మాదులు, కామోన్మాదులు సిగ్గువిడిచి మహిళల పాలిట కీచకులుగా మారుతున్నారు. 'ప్రేమిస్తున్నా.. పెళ్లిచేసుకో.. లేకుంటే నిన్ను చంపి నీ శవానికైనా తాళికడతా'నని రేపల్లెలో ఓ ప్రేమోన్మాది పాలిటెక్నిక్ విద్యార్థిని బెదిరించిన విషయం వెలుగు చూసింది. గుంటూరు జిల్లా రేపల్లెలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థినిని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీనివాస్ ప్రేమ పేరుతో తీవ్రంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె తల్లితో కలసి శ్రీనివాస్ పై డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News