: గంగూలీ ఆదేశం పట్ల సచిన్ అసంతృప్తికి లోనైన వేళ...!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, డ్రెస్సింగ్ రూంలో మాత్రం కొన్ని సమయాల్లో తన భావాలను అదుపు చేసుకోలేడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. ఈఎస్పీఎన్ క్రికిన్ఫోకు రాసిన ఓ వ్యాసంలో దాదా ఈ విషయాలు పంచుకున్నాడు. 2002-03 టూర్లో తాను జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నానని, అప్పుడు సచిన్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయమని కోరానని చెప్పాడు. అప్పుడు సచిన్ వెంటనే తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశాడని గంగూలీ తెలిపాడు. అయితే, ఆ డౌన్లో బ్యాటింగ్ చేయాల్సింది కొంత కాలమే అని సర్దిచెప్పాల్సి వచ్చిందని వివరించాడు. ఆ తర్వాత సచిన్ ను 2003 వరల్డ్ కప్ సందర్భంగా తిరిగి ఓపెనర్ గా పంపామని పేర్కొన్నాడు.