: మాయాలేదు, మర్మంలేదు... ఐపీఎల్ అంతా పారదర్శకమేనట!


ఐపీఎల్-7 సీజన్ లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోవని బీసీసీఐ హామీ ఇస్తోంది. గత సీజన్లలో కొందరు వ్యక్తుల వల్లే చెడ్డపేరు వచ్చిందని నేడు జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజా సీజన్ లో ఫిక్సింగ్ కు అవకాశమే ఉండదని ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్ లన్నీ పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఆటగాళ్ళతోపాటు ఫ్రాంచైజీలకు కూడా ఫిక్సింగ్ నిరోధంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొందరు వ్యక్తులను గుర్తించామని, ఐపీఎల్-7 సందర్భంగా వారిని కట్టడి చేస్తామని బిశ్వాల్ చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కూడా ఇలాగే స్పందించారు. ఐపీఎల్ ను అవినీతి రహితం చేసేందుకు బీసీసీఐ సాధ్యమైనమేర కృషి చేస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News