: చప్పట్లు కొట్టండి... ప్రత్యేకహోదా సాధించండి: నితీష్ కుమార్


చప్పట్లు కొట్టి ప్రత్యేక హోదా సాధించాలని బీహార్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, మార్చి2న బంద్ లో రాష్ట్ర ప్రజలంతా పాల్గొని ఢిల్లీకి వినిపించేలా చప్పట్లతో హోరెత్తించాలని, ఆ హోరుకు ఢిల్లీ పీఠం దద్దరిల్లి ప్రత్యేకహోదా ఇవ్వాలని అన్నారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తమ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కేంద్రం చాలా కాలంగా బీహార్ డిమాండ్ ను పట్టించుకోకపోవడంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్చి 2 రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా కేంద్ర సర్వీసులన్నీ నిలిపేసేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News